LPG Gas Paytm Offer: ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ క్యాష్‌బ్యాక్ ఆఫర్, Freeగా LPG Cylinder

LPG Cylinder Cashback Offer | నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోతున్నాయి. గ్యాస్ ధరలు సైతం సామాన్యులకు భారంగా మారాయి. ఈ నేపథ్యంలో డిజిటల్ పేమెంట్ సంస్థలు వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చనున్నాయి. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే వారికి పేటీఎం (Paytm) ఆఫర్ ప్రకటించింది.

1 /5

LPG Cylinder Cashback Offer | నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోతున్నాయి. గ్యాస్ ధరలు సైతం సామాన్యులకు భారంగా మారాయి. ఈ నేపథ్యంలో డిజిటల్ పేమెంట్ సంస్థలు వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చనున్నాయి. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే వారికి పేటీఎం (Paytm) ఆఫర్ ప్రకటించింది. రూ.800 మేర క్యాష్ బ్యాక్ ప్రయోజనం చేకూరుతుందని తెలిపింది.  Also Read: EPF Interest Amount: 6 కోట్ల మంది ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త, వడ్డీపై కీలక నిర్ణయం

2 /5

ఎల్పీజీ వంట గ్యాస్ సిలిండర్ ధర ఒక్కో నగరంలో ఒక్కో రేటు ఉంటుంది. ఆయా నగరాలను బట్టి రూ.808 నుంచి 850 వరకు 14 కేజీల వంటగ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తున్నారు. అయితే తొలిసారిగా గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తున్న వారికి మాత్రమే ఈ క్యాష్ బ్యాక్ వర్తిస్తుందని తెలిపింది. 

3 /5

ఎల్పీజీ సిలిండర్ బుక్ చేసుకోవాలనుకునే వారు మొదటగా తమ మొబైల్‌లో పేటీఎం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. పేటీఎం యాప్ ఓపెన్ చేశాక అందులో బుక్ గ్యాస్ సిలిండర్ ఆప్షన్ కనిపిస్తుంది. అందులో మీకు భారత్ గ్యాస్, హెచ్‌పీ గ్యాస్ మరియు ఇండేన్ గ్యాస్ పేర్లు కనపిస్తాయి.  Also Read: Best Pension Plans: బెస్ట్ పెన్షన్, సేవింగ్స్ ప్లాన్ కావాలంటే ఈ వివరాలు చదవండి

4 /5

వినియోగదారుడి నెంబర్ (Consumer Number), మొబైల్ నెంబర్ లేదా ఎల్‌పీజీ ఐడీతో మీకు కావాల్సిన సిలిండర్ కంపెనీ మీద క్లిక్ చేయాలి. మీ వివరాలు అక్కడ నమోదు చేయాలి. ఆపై బుకింగ్‌కు రూ.800 క్యాష్ బ్యాక్ ఆఫర్ సెలక్ట్ చేసుకోవాలి. మీరు పేమెంట్ చేయగానే స్క్రాచ్ కార్డ్ (Scratch Card) వస్తుంది. పేటీఎం ద్వారా తొలిసారి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న వారికి ఈ క్యాష్ బ్యాక్ లభిస్తుంది. బుక్ చేసిన 48 గంటల్లోగా మీకు స్క్రాచ్ కార్డ్ వస్తుంది. Also Read: Post Office Senior Citizen Savings Scheme: సీనియర్ సిటిజన్స్ కోసం పోస్టాఫీసు సరికొత్త స్కీమ్, Tax Benefits

5 /5

స్క్రాచ్ కార్డ్ ఓపెన్ చేస్తే మీకు క్యాష్ బ్యాక్ అందుతుంది. ఒకవేళ ఇక్కడ మీకు స్క్రాచ్ కార్డ్ రాకపోతే మీరు క్యాష్ బ్యాక్ మరియు ఆఫర్స్ (Cashback and Offers Section) సెక్షన్‌లో చెక్ చేస్తే కనిపిస్తుంది. దీనిని 7 రోజుల్లోగా ఉపయోగించాలి. జూన్ 30లోగా కస్టమర్లు రూ.500కు పైగా చేస్తున్న పేటీఎం తొలి ట్రాన్సాక్షన్‌లకు ఆఫర్ వర్తిస్తుంది. ఫోన్‌పే మరియు గూగుల్ పే తరువాత దేశంలో మూడో అతిపెద్ద డిజిటల్ పేమెంట్ అగ్రిగేటర్ పేటీఎం అని తెలిసిందే. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G Apple Link - https://apple.co/3loQYe మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook